Event Page

«Prev From May 29, '25 to Jun 28, '25 Next»
3924
Songs of Resistance & Play
Wed Mar 22, 7:30 PM
Lamakaan Programming Team
An Evening of Resistance Songs and Play by PKM

మార్చి 23, ష‌హీద్‌దివ‌స్ సంద‌ర్భంగా భ‌గ‌త్‌సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్ ల స్మృతిలో... ప్ర‌జా క‌ళామండ‌లి క‌ళాకారుల ప్ర‌ద‌ర్శ‌న‌. ప్ర‌జా క‌ళామండ‌లి తెలుగు నేలపై రెండు ద‌శాబ్ధాల‌కు పైగా వివిధ ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై త‌న గ‌ళాన్ని వినిపిస్తున్న సాంస్కృతిక సంస్థ‌. కుల‌, లింగ‌, ప్రాంతీయ వివ‌క్ష‌ల‌కు వ్య‌తిరేకంగా సాంస్కృతిక రంగంలో త‌నపాత్ర పోషిస్తోంది. మ‌తోన్మాదం, సామ్రాజ్య‌వాద దాడిని ఎండ‌గ‌డుతూ ప్ర‌జ‌ల్లో చైత‌న్యాన్ని ర‌గిలిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల‌తో పాటు దేశ వ్యాప్తంగా ప‌లు చోట్ల నిర్వాసిత స‌మ‌స్య‌, హిందూ మ‌తోన్మాదం, రైతాంగ ఆత్మ‌హ‌త్య‌లు, కుల వివ‌క్ష వంటి అంశాల‌పై ప‌లు నాట‌కాల‌ను ప్ర‌ద‌ర్శించింది.

దేశ వ్యాప్తంగా ప్ర‌జ‌లు త‌మ హ‌క్కుల కోసం పోరాటం చేస్తున్నారు. బ్రిటీష్ పాల‌న‌లో వినిపించిన ఆజాదీ నినాదం ఇవాల్టికీ అంతే బ‌లంగా వినిపిస్తోంది. క‌శ్మీర్ నుంచి కేర‌ళా వ‌ర‌కు జైల్లు నోళ్లు తెరుకొని సామాన్యుడిని క‌బ‌ళిస్తున్నాయి. క‌నీస ప్ర‌జాస్వామ్య హ‌క్కులు కూడా అమ‌లు కానీ ప‌రిస్థితుల్లో రాజ‌కీయ విశ్వాసాలు క‌లిగి ఉండ‌డం కూడా నేరంగా మారింది. దేశ వ్యాప్తంగా వేలాది మంది రాజ‌కీయ ఖైదీలు జైళ్ల‌లో మ‌గ్గుతున్నారు. ఇలాంటి సంద‌ర్భంలో త‌మ క‌ళారూపాల ద్వారా ప్రతి ఒక్క‌రి భాద్య‌త‌ను గుర్తుచేయ‌నుంది ప్ర‌జా క‌ళామండ‌లి.

భ‌గ‌త్‌సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్ ల 86వ వ‌ర్థంతి సంద‌ర్భంగా ప్ర‌జా క‌ళామండ‌లి క‌ళాకారులు ప్ర‌తిఘ‌ట‌నా గీతాల‌తో ముందుకు వ‌స్తున్నారు. తెలుగు నాటిక‌ను ప్ర‌ద‌ర్శించ‌నున్నారు.